Jawan Movie Super : ఎవరీ సారా అనుకుంటున్నారా. బారత దేశ క్రికెట్ లో రారాజుగా పేరు పొందిన సచిన్ రమేష్ టెండూల్కర్ తనయురాలే ఈ సారా టెండూల్కర్. ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైరల్ గా మారింది.
Jawan Movie Super Comments on Sara
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , నయన తార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి కలిసి నటించిన అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రాన్ని ఇటీవల చూసింది సారా టెండూల్కర్(Sara Tendulkar). ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా జవాన్ పై స్పందించింది.
అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చింది. ప్రత్యేకించి ఈ సినిమా తనను ఆకట్టుకుందని చెప్పింది సారా టెండూల్కర్. ప్రత్యేకించి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ మేకింగ్ తనకు నచ్చిందన్నారు. ప్రత్యేకించి రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసిందని ప్రశంసలతో ముంచెత్తింది సారా టెండూల్కర్.
ఇప్పటికే జవాన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కాసులు కొల్ల గొడుతోంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. రికార్డు బ్రేక్ చేసింది జవాన్ చిత్రం. ఇక షారుక్ ఖాన్ కు ఈ ఏడాదిలో రెండో సక్సెస్ మూవీ. పఠాన్ చిత్రం రూ. 1,000 కోట్లు కొల్లగొట్టింది. వచ్చే ఏడాది 2024లో డుంకీ విడుదల కానుంది.
Also Read : Jailer Movie Malaysia : మలేషియాలో జైలర్ మేనియా