తమిళ సినీ రంగంలో కీలక నటుడిగా పేరు పొందిన జయం రవి వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. తను గత కొంత కాలంగా సింగర్ కనీషాతో డేటింగ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తనతో దర్శనం ఇస్తున్నారు. ఇదే సమయంలో తన భార్య ఆర్తి ప్రకాశ్ తో విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది భార్య. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ సంసారం ఇప్పటి దాకా సాఫీగా సాగిందని, కానీ ఎప్పుడైతే సింగర్ తో స్నేహం కుదిరిందో ఆనాటి నుంచి తమ కొంపలో కుంపటి రాజేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.
తాజాగా సంచలన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. జయం రవి, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ ఓ దేవాలయంలో దర్శనం ఇచ్చారు. ఇద్దరూ పూల దండలతో దర్శనం ఇవ్వడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఓ వైపు కేసు కోర్టులో కొనసాగుతుండగా ఇంకో వైపు ఇద్దరు కలిసి ఎలా వెళతారంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. సింగర్ కెనీషాతో రెండో పెళ్లి చేసుకున్నాడా అనే అనుమానం కలుగుతోంది.
ఆర్తి రవితో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎలా అనే దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా వివాదాస్పదంగా మారిన జయం రవి ఫోటో. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఈ ఫోటోలు. ఇదిలా ఉండగా గత ఏడాది జూన్ లో గోవాలో జయం రవి, కెనీషా లు పట్టుబడ్డారు. వేగంగా కారు నడిపినందుకు జరిమానా విధించారు.
