తమిళనాడు – సినీ రంగంలో బంధాలు శాశ్వతంగా ఉండవు. ఎవరో కొద్ది మంది హీరో హీరోయిన్లు పద్దతిగా ఉన్నారు. కానీ చాలా మంది కొంత కాలం పాటు సఖ్యతతో ఉన్నారు. ఆ తర్వాత ఈగోల వల్ల విడి పోయారు. ఇంకొందరు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు సినీ నటుడు జయం రవి. తను ఓ సింగర్ ప్రేమలో పడ్డాడని, తనతో డేటింగ్ చేస్తున్నాడని, తనకు దూరంగా ఉంటున్నాడని సంచలన ఆరోపణలు చేసింది భార్య ఆర్తి ప్రకాశ్.
తనపై చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని పేర్కొంటూ ఇటీవలే జయం రవి ఓ సుదీర్ఘ లేఖ రాశాడు. తన వల్లే తాను అన్నీ కోల్పోయానని, అప్పులు చేసిందని, రోడ్డు పాలైనట్లు వాపోయాడు. తట్టుకోలేకనే తాను ఆర్తి ప్రకాశ్ నుంచి విడాకులు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా జయం రవి, ఆర్తి ప్రకాశ్ లు విడాకుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.
తాజాగా ఇందుకు సంబంధించి ఆసక్తికరమైన టాక్ ఒకటి బయట పడింది. అదేమిటంటే ఆర్తి ప్రకాశ్ తనకు ప్రతి నెలా రూ. 40 లక్షలు భరణంగా జయం రవి చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో బావురుమన్నాడు జయం రవి. తను శాడిస్ట్ అని, అనుకునేంత మంచి వ్యక్తి కాదంటూ నిందలు వేసే ప్రయత్నం చేశాడు. మొత్తంగా ఈ ఇద్దరి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.