ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ లో అత్యంత వేగంగా పరుగులు సాధించిన క్రికెటర్ గా తను చరిత్ర సృష్టించాడు. ఏకంగా 13000 పరుగులు చేయడం విశేషం. తను ప్రధానంగా అద్భుతమైన బ్యాటర్. ఎలాంటి బంతినైనా అవలీలగా బౌండరీ లైన్ దాటిస్తాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. ప్రపంచంలోని టాప్ బౌలర్లను ఇప్పటి వరకు తను ఉతికి ఆరేశాడు. దీంతో తనకు బౌలింగ్ చేయాలంటేనే జడుసుకునే పరిస్థితి వచ్చింది.
ఇక ఈ మధ్యన ఇంగ్లండ్ క్రికెటర్లు దంచి కొడుతున్నారు. మైదానంలోకి వచ్చీ రావడంతోనే పరుగుల వరద పారిస్తున్నారు. ఇదే జట్టుకు చెందిన స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో ఉతికి ఆరేస్తున్నాడు. బౌలర్ల భరతం పడుతున్నాడు. అత్యధిక రన్స్ చేసి సత్తా చాటాడు. తనకు ఎదురే లేదని నిరూపించాడు. దీంతో ఇప్పుడు జో రూట్ సైతం సూపర్ షో తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టెస్టు ఫార్మాట్ ను వన్డే ఫార్మాట్ గా , టి20 ఫార్మాట్ గా మార్చేసిన ఘనత జో రూట్ కు దక్కుతుంది.
బౌలర్లు ఎలాంటి బంతులు విసిరినా, ఎక్కడి నుంచి వేసినా కొట్టడమే తన పని. దీంతో అత్యధిక రన్స్ తన ఖాతాలో వచ్చి చేరాయి. విచిత్రం ఏమిటంటే కేవలం ఇన్ని రన్స్ చేసేందుకు కేవలం తను ఆడిన మ్యాచ్ లు 153 మాత్రమే. గతంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ జాక్వస్ కల్లిస్ పేరుతో ఉండేది. దానిని తుడిచి వేశాడు జో రూట్. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ 160 మ్యాచ్ లు ఆడితే, పాంటింగ్ 162 మ్యాచ్ లు, టెండూల్కర్ 163 మ్యాచ్ లు ఆడారు. వీరందరికీ షాక్ ఇస్తూ సూపర్ షో చేశాడు జో రూట్.