Hero Jr NTR :జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

మే 20న పుట్టిన రోజు పోస్ట‌ర్..గ్లింప్స్ రిలీజ్

Hero Jr NTR

Jr NTR : టాలీవుడ్ స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరోగా మారి పోయాడు. త‌ను న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకుంది. ఆ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం దేవ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ కీ రోల్ పోషించింది. కాసుల వ‌ర్షం కురిపించింది. ఆ త‌ర్వాత స్ట్రెయిట్ హిందీ మూవీ వార్ లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఇంకో పాట ఒక్క‌టే మిగిలి పోయింది.

Jr NTR Movie Updates

త్వ‌ర‌లోనే అద‌ది పూర్త‌యింతే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆగ‌స్టు 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. ఇక మ‌రో మూవీలో బిజీగా మారి పోయాడు తార‌క్. దేశ సినీ చ‌రిత్ర‌లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రాగ‌న్ మూవీలో న‌టిస్తున్నాడు. షూటింగ్ కూడా మొద‌లైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల‌ను షేక్ చేస్తున్నాయి. వార్ 2 పార్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ కీ రోల్ పోషిస్తున్నాడు.

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్(Jr NTR) కు సంబంధించి త‌న పుట్టిన రోజు ఈ నెల 20న రానుంది. ఇందుకు సంబంధించి ఇరు సినిమాల మూవీ మేక‌ర్స్ బిగ్ ప్లాన్ చేశారు. తార‌క్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌గా ఉంటుంది. వారికి తీపి క‌బురు చెప్పారు. హృతిక్ న‌టించే వార్ కు సంబంధించి పోస్ట‌ర్ ను, ప్ర‌శాంత్ నీల్ షూటింగ్ అప్ డేట్స్ తో గ్లింప్స్ ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో త‌న బ‌ర్త్ డే ఎప్పుడు వ‌స్తుందా అని నంద‌మూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

Also Read : Hero Suhas-Mandadi :మందాడి సుహాస్ ఫ‌స్ట్ లుక్ కెవ్వు కేక

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com