ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ క‌న్నుమూత

బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ

హైద‌రాబాద్ – జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం క‌న్నుమూశారు. ఆయ‌న మృతి చెందిన‌ట్లు ఏఐజీ ఆస్ప‌త్రి వైద్యులు ప్ర‌క‌టించారు . జూన్ 5వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు మాగంటి గోపీనాథ్ (62) తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు BRS పార్టీని తీవ్ర దుఃఖంలో వదిలి వెళ్లారు. ఆదివారం తెల్ల వారుజామున 5.45 గంట‌ల‌కు తుది శ్వాస విడిచారని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా మాగంటి గోపీనాథ్ జూన్ 2, 1963న హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో పుట్టారు. పేరెంట్స్ మాగంటి కృష్ణ‌మూర్తి, కుమారి. దివంగ‌త న‌టులు ఎన్టీఆర్, కృష్ణ‌ల‌కు త‌ను వీరాభిమానిగా గుర్తింపు పొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీ స‌భ్యుడిగా కొన‌సాగారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ ల‌కు మ‌ద్ద‌తుగా త‌ను నిర్వ‌హించిన బుల్లెట్ ర్యాలీలు అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపాయి.

మాగంటి గోపీనాథ్ అభిరుచిని గ‌మ‌నించారు ఎన్టీఆర్. 1985లో త‌న‌ను తెలుగు యువ‌త అధ్య‌క్షుడిని చేశారు. 1987-1990 మధ్య ఆయన హుడా డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆ సమయంలో, గోపీనాథ్ చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లతో సత్సంబంధాలు కొనసాగించారు. 2014లో, మాగంటి గోపీనాథ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఆంధ్రా సెటిలర్లపై తీవ్ర వ్యతిరేకత మధ్య విజయం సాధించారు. తరువాత ఆయన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీలో చేరి 2018 , 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా గెల‌వ‌క ముందు మాగంటి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత. శ్రీ‌కాంత్, సురేష్ ల‌తో పాత బ‌స్తీ, రాజశేఖ‌ర్, సౌంద‌ర్య‌ల తో ర‌వ‌న్న‌, తార‌క‌ర‌త్న‌తో భ‌ద్రాద్రి రాముడు, రాజ‌శేఖ‌ర్, భూమికా చావ్లాతో నా స్టైల్ చిత్రాలు నిర్మించారు. 2023లో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో టీమిండియా మాజీ స్కిప్ప‌ర్ అజారుద్దీన్ పై 16 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com