జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. ఏ పాత్ర ఇచ్చినా సరే దానికి వంద శాతం న్యాయం చేస్తాడు. తను ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తన సినీ కెరీర్ లో తొలిసారిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీనే వార్ -2. గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రానికి ఇది సీక్వెల్ గా వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీశాడు దర్శకుడు. పోరాట సన్నివేశాలు కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.
ఇందులో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడి నటించారు. ఇందుకు సంబంధించి మూవీ మేకర్స్ వార్ -2 మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. మిలియన్స్ వ్యూస్ తో దూసుకు పోతోంది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మే 20 తారక్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా అందరూ డ్రాగన్ ప్రశాంత్ నీల్ నుంచి గ్లింప్స్ వస్తుందని అనుకున్నారంతా . కానీ ఎలాంటి ప్రకటన రాలేదు దర్శకుడి నుంచి.
దీంతో తారక్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ తరుణంలో వార్ -2 నుంచి టీజర్ రిలీజ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ లెక్కన విడుదలైతే బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని పేర్కొంటున్నారు. మొత్తంగా తారకా మజాకా కదూ.