సినిమా రంగంతో పోటీ పడుతోంది బుల్లి తెర. ప్రస్తుతం సీరియల్స్ హవా కొనసాగుతోంది. ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో వెబ్ సీరీస్ దుమ్ము రేపుతున్నాయి.
తాజాగా స్టార్ మా ఛానెల్ లో గుప్పెడంత మనసు సీరియస్ కు భారీ ఆదరణ లభిస్తోంది. ఇందులో జగతి మేడం పాత్రలో లీనమై నటించింది జ్యోతి రాయ్. ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తాజాగా జ్యోతి రాయ్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఆమె రియల్ గా టాలీవుడ్ దర్శకుడిని పెళ్లాడనున్నట్లు టాక్. ప్రస్తుతం గుప్పెడంత మన సు సీరియల్ యూత్ కు నచ్చేలా తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ఈ సీరియల్ లో నటిస్తున్న హీరోకు తల్లిగా ప్రధాన పాత్ర చేస్తోంది జ్యోతి రాయ్. ఇటు తెలుగులో అటు కన్నడలో సీరియల్స్ లలో బిజీగా మారి పోయింది . ప్రత్యేకించి జగతి మేడం ఇంటిల్లిపాదిని ఆకట్టుకుంటోంది.
దీంతో ఈ ఒక్క పాత్ర మరిచి పోలేకుండా చేస్తోంది సీరియల్ నటిని. మాట రాని మౌనమిది, శుక్ర సినిమాలను తీసిన దర్శకుడు సుకుపూర్వాజ్ అలియాస్ సురేష్ కుమార్ తో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్.