భారతీయ ఇతిహాసాలకు ఇప్పుడు ఫుల్ మార్కెట్ ఏర్పడింది. ఒక రకంగా మతం, భక్తి ప్రధానంగా సాగే సినిమాలకు, కథలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక భారతీయ చరిత్రలో విస్మరించ లేని ఇతిహాసం రామాయణం. దీనిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వెబ్ సీరీస్ , సీరియల్స్ కూడా రూపుదిద్దుకున్నాయి. తాజాగా హిందీతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రామాయణ్ చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇందులో నేచురల్ స్టార్ కేరళ కుట్టి సాయి పల్లవి సీతగా, యానిమల్ మూవీతో దుమ్ము రేపిన రణ్ బీర్ కపూర్ శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రధాన హైలెట్ ఏమిటంటే కన్నడ సూపర్ స్టార్ కేజీఎఫ్, టాక్సిక్ హీరో యశ్ ఇందులో మరో ముఖ్య పాత్రను పోషిస్తుండడం. ఇక రామాయణ్ చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే మండోదరి పాత్రకు సంబంధించి బాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ స్క్రీన్ షేర్ చేసుకోనుందని టాక్.
ప్రభాస్, కృతీ సనన్ కలిసి నటించిన ఆది పురుష్ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. భారీ ఎత్తున ప్రచారం కూడా చేసినా ఫలితం లేకుండా పోయింది. దర్శకుడి పేలవమైన ప్రదర్శన ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. ఈ సమయంలో రామాయణ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ ఎత్తున తారాగణం ఉండడం ఈ సినిమాపై బజ్ పెంచేలా చేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. మరి కాజల్ మండోదరి పాత్రతో మెప్పిస్తుందా ..రామాయణ్ ఆకట్టుకుంటుందా అనేది వేచి చూడాలి.
