Kajal Aggarwal : ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది పెద్ది మూవీ. ఇటీవలే గ్లింప్స్ విడుదల చేశారు. పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. మార్కెట్ లో భారీ ధర పలుకుతోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పెద్దిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ , కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో పాటు భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా నటించనున్నారు.
Kajal Aggarwal Special Song in Peddi Movie
తాజాగా పెద్ది సినిమా గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారని, ఇందులో ప్రముఖ నటి, బాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ను తీసుకుంటున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న సినిమాలలో, విడుదలైన చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. సుకుమార్ తీసిన పుష్ప -1లో సమంత రుత్ ప్రభు స్పెషల్ సాంగ్ లో నటించింది. పుష్ప-2 సీక్వెల్ మూవీలో లవ్లీ బ్యూటీ శ్రీలీల కిస్సక్ పాటతో కిర్రాక్ తెప్పించింది.
వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన నితిన్ రెడ్డి, శ్రీలీల కలిసి నటించిన రాబిన్ హుడ్ లో కేతకి శర్మ స్పెషల్ సాంగ్ లో నటించింది. బాబ్జీ దర్శకత్వం వహించిన నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజ్ లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ లో నటించింది. మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్ లో స్వాతి రెడ్డి ప్రత్యేక పాటలో తళుక్కున మెరిసింది. ఇక గతంలో రామ్ చరణ్ తో కలిసి నటించింది కాజల్ అగర్వాల్.
Also Read : Beauty Trisha Krishnan :ముద్దుగుమ్మ పెళ్లికి సిద్దమవుతోందా..?