తమిళనాడు – ప్రముఖ చలన చిత్ర నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు, ఇలయ నాయగన్ గా వినుతికెక్కిన సహజ నటుడు కమల్ హాసన్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. గతంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.
ఇందులో భాగంగా తమ పార్టీ తరపున రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలలో ఒక స్థానాన్ని కమల్ హాసన్ కు కేటాయిస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చారు. ఈ మేరకు డీఎంకే చీఫ్, మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇచ్చిన మాట కోసం స్టాలిన్, కొడుకు ఉదయనిధి స్టాలిన్ స్వయంగా కమల్ హాసన్ తో నామినేషన్ దాఖలు చేయించారు. వారే దగ్గరుండి చూసుకున్నారు.
మొత్తం రాజ్యసభ స్థానాలలో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒక దానిని ఇలయ నాయగన్ కు కేటాయించారు. ఆయనకు పోటీగా ఎవరూ లేక పోవడంతో కమల్ ఎన్నిక లాంఛన ప్రాయంగా సాగింది. ఇదిలా ఉండగా తమిళ చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. తన కూతురు శ్రుతి హాసన్ కూడా నటిగా గుర్తింపు పొందింది. తన తొలి భార్య కూతురు. ఆ తర్వాత గౌతమిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తను నటించిన థగ్ లైఫ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
