సినిమా రంగంలో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. ఎంతగా కాంట్రావర్సీ అవుతే అంత బాగా జనాల్లోకి సినిమా వెళుతుందనే అభిప్రాయం నెలకొంది. ఇది ఒక రకంగా ఆయా సినిమాలకు సంబంధించి ప్లస్ అయినా చాలా సార్లు వ్యూహం బెడిసి కొట్టిన సందర్భాలు లేక పోలేదు. తాజాగా ఇలయ నాయగన్ కమల్ హాసన్, అందాల భామ త్రిష కృష్ణన్, విలక్షణ నటుడు సిలాంబరసన్ కలిసి నటించిన చిత్రం థగ్ లైఫ్. భారతీయ సినీ రంగంలో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు పొందిన మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంది.
ఈ సినిమాకు కథ రాయడంతో పాటు ఓ పాటను కూడా అందించాడు విలక్షణ నటుడు కమల్ హాసన్. ఇప్పటికే పెద్ద ఎత్తున చేసిన ప్రచారం కొంత వరకు థగ్ లైఫ్ కు తోడ్పడినా చెన్నై వేదికగా కర్ణాటక భాష గురించి చేసిన కామెంట్స్ కాంట్రావర్సీకి దారి తీశాయి. చివరకు కన్నడిగులు కన్నెర్ర చేశారు. తన సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. క్షమాపణ చెప్పాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. చివరకు ధర్మాసనం ఇలయ నాయగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరుల మనోభావాలను కించ పర్చడం కాదని మండిపడింది. వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.
దీంతో కమల్ హాసన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కర్ణాటక ఫిలిం చాంబర్ కు ఓ లేఖ రాశాడు. మనందరం ఒక్కటేనని, తాను దురుద్దేశ పూర్వకంగా కామెంట్స్ చేయలేదని అన్నాడు. ఇక ఈ వివాదాల మధ్య జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది థగ్ లైఫ్. టేకింగ్, మేకింగ్ లో తనదైన ముద్ర కనబర్చాడు మరోసారి మణిరత్నం. మొత్తంగా ఇది మణిరత్నం, కమల్ హాసన్ ల మూవీ. తప్పక చూడాల్సిన చిత్రం .
