తమిళ చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకడిగా పేరు పొందాడు ఇలయ నాయగన్ కమల్ హాసన్. తను కీ రోల్ పోషించిన చిత్రం థగ్ లైఫ్. దీనిని అద్భుతంగా తెర కెక్కించాడు దిగ్దజ దర్శకుడు మణిరత్నం. ఇందులో కమల్ హాసన్ తో పాటు సిలాంబరసన్, లవ్లీ బ్యూటీ త్రిష కృష్ణన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా థగ్ లైఫ్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విడుదల కాకుండానే థగ్ లైఫ్ భారీ అంచనాలు పెంచేస్తోంది. ఈ సందర్బంగా కమల్ హాసన్ చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కన్నడ భాషపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కన్నడ తమిళంలోంచి పుట్టిందంటూ పేర్కొన్నారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కన్నడ నాట ఆగ్రహం తెప్పించేలా చేశాయి. తకు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని లేక పోతే తను నటించిన థగ్ లైఫ్ ను ఆడకుండా, ప్రదర్శించకుండా అడ్డుకుని తీరుతామంటూ వార్నింగ్ ఇచ్చారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు ఇలయ నాయగన్ (లోక నాయకుడు ) తాను అన్నదాంట్లో తప్పేముందంటూ ప్రశ్నించారు. తాను జీవితంలో తప్పు చేయనని, ఎవరికీ తలవంచనని, ఒకవేళ తప్పు చేసినట్లు భావిస్తే తాను క్షమాపణ చెప్పేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించాడు కమల్ హాసన్.
