Kamalhaasan : విజయవాడ – దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటుడని ప్రశంసలు కురిపించారు లోకనాయకుడు కమల్ హాసన్. ఇవాళ విజయవాడ వేదికగా కృష్ణ పేరుతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు. తాము ఉత్త స్టార్లమని కానీ నిజమైన హీరో ఇటు తెర మీద అటు జీవితంలో కూడా అని కితాబు ఇచ్చారు కమల్ హాసన్.
Kamalhaasan Praises Super Star Krishna
ఈ కార్యక్రమాంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో పాటు ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు మరికొందరు నటులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అధికారంలో ఉన్న వైఎస్సార్ఎస్పీకి చెందిన దేవినేని అవినాష్ ఈ విగ్రహ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్బంగా ప్రిన్స్ మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, దివంగత నటుడు , సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు కమల్ హాసన్(Kamalhaasan) కు , వైసీపీ లీడర్ అవినాష్ కు ధన్యవాదాలు తెలిపారు . ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన తండ్రికి తాను కొడుకునై పుట్టినందుకు గర్వ పడుతున్నానని పేర్కొన్నారు మహేష్ బాబు.
Also Read : Kartika Muralidharan : ‘శృంగార’ ఆకాశం దాటి వస్తావా
