మంచు మోహన్ బాబు సమర్పణలో నిర్మించిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. జూన్ 27న కన్నప్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ , మోహన్ బాబు, ప్రభాస్ , బ్రహ్మానందం, రఘుబాబు ఇతర పాత్రలు పోషించారు. స్టీఫెన్ సంగీతం అందించగా షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అందించారు.
విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కాసులు రావడం మొదలైంది. పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు సైతం కన్నప్పను ప్రశంసించారు. బాగుందంటూ కితాబు ఇచ్చారు. దీంతో వీరి కామెంట్స్ కన్నప్ప చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. కంటెంట్ పరంగా అద్భుతంగా ఉండడం, దర్శకుడు ఎక్కడా రాజీ పడకుండా తీయడం సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది.
సినిమా కోసం మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇది పక్కన పెడితే కన్నప్ప బిగ్ సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్బంగా మంచు విష్ణు మీడియాతో మట్లాడారు. నిజాయితీగా మూవీ తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని తమ సినిమా విజయంతో నిరూపితమైందని అన్నారు. భారీ ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.