Kannappa Sensational :క‌న్న‌ప్ప మూవీ ప్ర‌మోష‌న్స్ షురూ

అమెరికాలో విస్తృతంగా ప్ర‌చారం

Kannappa : మంచు మోహ‌న్ బాబు స‌మర్ప‌ణ‌లో వ‌స్తున్న చిత్రం క‌క‌న్న‌ప్ప‌. ఇందులో భారీ తారాగ‌ణం ఉంది. మోహ‌న్ బాబుతో పాటు మోహ‌న్ లాల్, కాజల్ అగ‌ర్వాల్, మంచు విష్ణు, డార్లింగ్ ప్ర‌భాస్, ర‌ఘు బాబు కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు. క‌న్న‌ప్ప చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే పోస్ట‌ర్, టీజ‌ర్ , సాంగ్ రిలీజ్ చేశారు. మంచు విష్ణు త‌న సినీ కెరీర్ లో అత్యంత భారీ ప్రాజెక్టు క‌న్న‌ప్ప చిత్రం. ఇతిహాస మైలు రాయి చిత్రంగా మార్చేందుకు నానా తంటాలు ప‌డ్డాడు.

Kannappa Movie Promotions Sensational

ఈ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా మార్కెట్ తీసుకు వ‌చ్చేలా ప్లాన్ చేశాడు మంచు విష్ణు. క‌న్న‌ప్ప(Kannappa) మూవీ రిలీజ్ చేసే ప‌నిలో ప‌డ్డాడు. దీనిని వ‌చ్చే నెల జూన్ లో వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌నున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సూప‌ర్ టాక్ తెచ్చుకుంది. దీంతో దూకుడు పెంచాడు న‌టుడు.
ఈ సినిమాను ప్రమోట్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు ఇప్ప‌టికే. వారిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ గురు ర‌విశంక‌ర్ తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ పోస్ట‌ర్స్ ను ఆవిష్క‌రించారు.

అమెరికాలో క‌న్న‌ప్ప మూవీ ప్ర‌మోష‌న్స్ ను పెద్ద ఎత్తున ప్రారంభించాడు మంచు విష్ణ‌/. ఇందులో భాగంగా అమెరికాలో అత్య‌ధికంగా తెలుగు వారు నివ‌సిస్తున్న న్యూజెర్సీ న‌గ‌రం నుంచే స్టార్ట్ చేశాడు. రాత్రి 7:30 గంటలకు నార్త్ బ్రున్స్‌విక్‌లోని రీగల్ కామర్స్ సెంటర్‌లో అభిమానులతో సంభాషించాడు. మరుసటి రోజు, ఆయన డల్లాస్‌కు బయలుదేరి వెళ‌తారు. టెక్సాస్‌లోని గెలాక్సీ థియేటర్స్ గ్రాండ్‌స్కేప్‌ను సందర్శిస్తారు. మే 10న బే ఏరియాలో యుఎస్ లెగ్ టూర్ తో ముగుస్తుంది.

Also Read : Hero Nani-Hit 3 : హిట్ -3 వ‌సూళ్ల ప‌ర్వం నాని సంచ‌ల‌నం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com