Kannappa : మంచు మోహన్ బాబు సమర్పణలో మంచు విష్ణు, డార్లింగ్ ప్రభాస్ , మోహన్ లాల్, రఘు బాబు కీలక పాత్రలు పోషించిన చిత్రం కన్నప్ప(Kannappa) రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ విడుదలయ్యాయి. మంచి స్పందన లభిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఇదే సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తో పోస్టర్ ను ఆవిష్కరించారు. అంతకు ముందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ తో గ్లింప్స్ ను విడుదల చేయించారు. భారీ బడ్జెట్ తో కన్నప్ప చిత్రాన్ని నిర్మించారు.
Kannappa Movie Promotions
మూవీ ప్రమోషన్స్ ను ఇప్పటికే ప్రారంభించిన ఈ టీం నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. మే 8వ తేదీన అమెరికా నుండి విష్ణు స్టార్ట్ చేస్తామని ప్రకటించాడు. ఇప్పటికే ఈ విషయాన్ని పంచు కోవడం ఆనందంగా ఉందన్నాడు. ఈ సినిమా కోసం లక్షలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని తెలిపాడు మంచు విష్ణు. కన్నప్ప చిత్రానికి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే జూన్ 27న కన్నప్పను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు.
ఈ సినిమాకు సంబంధించి మార్కెట్ కొనసాగుతోంది. భారీ ఎత్తున తారాగణం ఉండడం కూడా కన్నప్పకు అదనపు బలంగా మారనుంది. ఇదే సమయంలో కీలక ప్రకటన చేశాడు మంచు విష్ణు. యుఎస్ లోని న్యూ జెర్సీలో రోడ్ షో చేస్తామన్నాడు. తర్వాత డల్లాస్, లాస్ ఏంజిల్స్ లో ప్రధాన కార్యక్రమాలు ఉంటాయన్నాడు.
Also Read : Beauty Sree Leela : అనాధ పిల్లలకు ఆసరా శ్రీలీల భరోసా