యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రతిష్టాత్మకమైన పురస్కారం దక్కింది. రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ఖరారు చేసింది. మొత్తం 30 సినిమాలకు అవార్డులు ప్రకటించింది. ఆరు స్పెషల్ జ్యూరీ కింద వెల్లడించింది. ఇందులో భాగంగా బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, ఎన్టీఆర్ ఫిలిం అవార్డులతో పాటు పైడి జయరాజ్, రఘుపతి వెంకయ్య , కాంతా రావు ఫిలిం అవార్డులను ఖరారు చేసింది.
ఎన్టీఆర్ అవార్డుకు గాను నందమూరి బాలకృష్ణను ఎంపిక చేసింది. బీఎన్ రెడ్డి పురస్కారం సుకుమార్ ను వరించింది. నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డును అట్లూరి పూర్ణ చందర్ రావును, కాంతారావు ఫిలిం అవార్డును విజయ్ దేవరకొండకు, రఘుపతి వెంకయ్య అవార్డు ను ప్రముఖ రచయిత యుండమూరి వీరేంద్ర నాథ్ ను వరించింది.
ఇక విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రాంతానికి చెందిన నటుడు. తను తొలుత వంగా సందీప్ రెడ్డి తీసిన అర్జున్ రెడ్డిలో హీరోగా నటించాడు. ఆ తర్వాత పలు సినిమాలలో ఛాన్స్ లు దక్కించుకున్నాడు. తాజాగా కింగ్ డమ్ లో నటించాడు. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.