Hero Shah Rukh Khan Daughter : షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సూప‌ర్

ప్ర‌శంస‌లు కురిపించిన క‌ర‌ణ్ జోహార్

Hero Shah Rukh Khan Daughter

Shah Rukh Khan : బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కింగ్ చిత్రంలో స్క్రీన్ షేర్ చేస్తోంది తొలిసారిగా బాద్ షా కింగ్ షారుక్ ఖాన్(Shah Rukh Khan) కూతురు సుహానా ఖాన్. ఈ సంద‌ర్బంగా త‌న గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తండ్రితో క‌లిసి కూతురు కూడా తెర‌పై క‌నిపించ‌డ‌డంతో ఈ కింగ్ మూవీపై భారీ అంచ‌నాలు ఇప్ప‌టి నుంచే మొద‌ల‌య్యాయి. త‌న‌లో అద్భుత‌మైన ప్ర‌తిభ దాగి ఉందంటూ పేర్కొంది.

Shah Rukh Khan Daughter Suhana Khan

సుహానా ఖాన్ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ కింగ్ మూవీతో తానేమిటో నిరూపించుకుంటాన‌ని అంటోంది. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు నిర్మాత క‌ర‌ణ్ జోహార్. ఇదిలా ఉండ‌గా రాజ్ ష‌మానీ పాడ్ కాస్ట్ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని భావాల‌ను పంచుకున్నాడు క‌ర‌ణ్ జోహార్. సుహాణా ఖాన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌న‌లో పుట్టుక‌తోనే న‌ట‌నా ప‌రంగా అద్భుత‌మైన ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని కొనియాడారు.

తాను చిన్న‌ప్ప‌టి నుంచి సుహానా ఖాన్ ను ప‌రిశీలిస్తూ వ‌చ్చాన‌ని చెప్పాడు క‌ర‌ణ్ జోహార్. సుహానా విద్యార్థి చిత్రాల‌ను చూశాన‌ని, త‌ను క‌ళ ప‌ట్ల చూపించే అంకిత భావానికి తాను ఎంతో ముగ్దుడ‌య్యాన‌ని చెప్పాడు.
న‌ట‌నా ప‌రంగా వంద శాతం త‌న ప‌ర్ పార్మెన్స్ ఇచ్చేందుకు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, ఇది త‌న‌ను మ‌రింత విస్తు పోయేలా చేసింద‌న్నాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే షారుక్ ఖాన్ గ‌ర్వ ప‌డేలా త‌ను న‌టించ బోతోందంటూ పేర్కొన్నాడు క‌ర‌ణ్ జోహార్.

Also Read : Hero Allu Arjun-Atlee :అల్లు అర్జున్ అట్లీ మూవీలో అమీర్ ఖాన్..?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com