Karthi Suriya Movie : సూర్య కార్తీ మూవీ క‌న్ ఫ‌ర్మ్

అన్న‌ద‌మ్ముల‌తో చిత్రం

కోలీవుడ్ లో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన న‌టుల‌లో ఒక‌రు సూర్య మ‌రొక‌రు కార్తీ. వీరిద్ద‌రూ స్వ‌యంగా అన్న‌ద‌మ్ములు కావ‌డం విశేషం. త‌మిళ సినీ అభిమానుల‌కు వీరంటే పిచ్చి ప్రేమ‌. వీరి కాంబినేష‌న్ లో ఓ సినిమా రావాల‌ని ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు.

తాజాగా వీరిద్ద‌రి మూవీకి సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు న‌టుడు కార్తీ. త్వ‌ర‌లోనే ఇద్ద‌రం క‌లిసి సినిమా చేయ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించాడు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు కార్తీ. ఒకే ప‌రిశ్ర‌మ‌లో అన్న‌ద‌మ్ములు అరుదుగా ఉంటారు.

కానీ మేమిద్ద‌రం ఎవ‌రికి వాళ్లం సినిమాల‌లో ప‌ని చేస్తూ పోతున్నామ‌ని పేర్కొన్నాడు కార్తీ. ఒక‌రి మీద మ‌రొక‌రికి ప్రేమ ఉంది. మూవీస్ చేస్తూ పోవ‌డం , క‌థ‌ల‌ను ఎంచు కోవ‌డంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నామ‌ని తెలిపాడు న‌టుడు కార్తీ.

ఇంత‌కు ముందు మేమిద్ద‌రం భ‌య‌ప‌డ్డాం. సినిమా ఎలా వ‌స్తుందోన‌ని, కానీ ఖ‌చ్చితంగా సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని స్ప‌ష్టం చేశాడు న‌టుడు కార్తీ. ద‌ర్శ‌కుడిగా ఎన్నేళ్లైయినా చేసేందుకు వీలుంటుంది. కానీ సినిమాల‌లో ఆ ఛాన్స్ ఉండ‌ద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు కార్తీ.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com