Retro : తమిళ సినీ రంగంలో అత్యంత జనాదరణ పొందిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. తను మంచి కథలు రాస్తాడు. అంతకు మించి భావుకుడు కూడా. కథ చెప్పే పద్దతి, సినిమా తీసే విషయంలో తను పడే కష్టం, తపన చాలా మందిని తనంటే ఇష్టపడేలా చేస్తుంది. విషయం పట్ల అవగాహన కలిగి ఉండేందుకు చాలా ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి దర్శకులు చాలా తక్కువ. తమిళంలో కొత్త తరం దర్శకులు వెల్లువలా పుట్టుకు వచ్చారు. మరో వైపు సీనియర్ దర్శకులు కూడా తమదైన శైలిలో రాణిస్తున్నారు.
Retro Movie Records
తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న సినిమా రెట్రో(Retro). ఇందులో సూర్య, బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజీ హెగ్డే నటించింది. ఇప్పటికే ప్రమోషన్స్ అదరగొట్టేలా ఉన్నాయి. ఇక చిట్ చాట్ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కార్తీక్ సుబ్బరాజ్. తాను చాలా సార్లు కథలు వినిపించానని, కానీ ఏ ఒక్క కథను ఓకే చేయలేదంటూ వాపోయాడు ప్రముఖ సినీ నటుడు, దళపతి విజయ్ పై. తను ఏఆర్ మురుగదాస్, అట్లీతో సినిమాలు తీశాడు. తన కల తీరకుండా పోయిందని వాపోయాడు.
తను ఆఖరి సినిమా జన నాయగన్ తీస్తున్నాడు. ఇది పక్కన పెడితే మే 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పాటలు, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ దుమ్ము రేపుతున్నాయి. అభిమానులకు మరింత జోష్ తెప్పించేలా చేస్తున్నాయి. ఇప్పటికే ముందస్తు టికెట్లు భారీ ఎత్తున అమ్ముడు పోయాయి. ఇక సూర్య సినీ కెరీర్ లో ఇది చిరస్మరణీయంగా మిగిలి పోతుందని చెప్పక తప్పదు. మరోసారి కార్తీక్ సుబ్బరాజ్ తో సినిమా చేయాలని ఉందని కోరిక వ్యక్తం చేశాడు సూర్య.
Also Read : Beauty Srinidhi Shetty :కేజీఎఫ్ మూవీతో స్టార్ ఇమేజ్