Karthik Subbaraj Shocking Comment :గేమ్ ఛేంజ‌ర్ క‌థను మార్చేసిన శంక‌ర్ 

ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ కామెంట్స్ 

Karthik Subbaraj Shocking Comment

Karthik Subbaraj : కోలీవుడ్ లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ద‌ర్శ‌కుడు శంక‌ర్. త‌ను తాజాగా రామ్ చ‌ర‌ణ్ తో దిల్ రాజు నిర్మాణ సార‌థ్యంలో గేమ్ ఛేంజ‌ర్ ను తీశాడు. రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తెర‌కెక్కించ‌గా దారుణంగా విఫ‌ల‌మైంది. నిర్మాత‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. చెర్రీకి దెబ్బ కొట్టింది. ఈ సంద‌ర్బంగా శంక‌ర్ అంటేనే హీరోలు, ఇత‌ర సాంకేతిక నిపుణులు భ‌య‌ప‌డే స్థితికి వ‌చ్చారు. తాజాగా టాప్ డైరెక్ట‌ర్ గా పేరొందిన కార్తీక్ సుబ్బ‌రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు శంక‌ర్ పై.

Karthik Subbaraj Shocking Comments on Game Changer Movie

గేమ్ ఛేంజ‌ర్ మూవీ క‌థ‌, దానికి సంబంధించిన ఐడియా అంతా త‌న‌దేన‌ని చెప్పాడు కార్తీక్ సుబ్బ‌రాజ్(Karthik Subbaraj). త‌ను ప్ర‌స్తుతం సూర్య‌, పూజా హెగ్డేతో రెట్రో మూవీ తీశాడు. ఇది మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే పోస్ట‌ర్, టీజ‌ర్, సాంగ్స్ కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. చిట్ చాట్ సంద‌ర్భంగా కార్తీక్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. గేమ్ ఛేంజ‌ర్ మూవీ క‌థ అంతా నాదేన‌ని ప్ర‌క‌టించాడు. కాగా శంక‌ర్ క‌థ‌ను పూర్తిగా మార్చేశాడ‌ని ఆరోపించాడు. స్క్రీన్ ప్లే కూడా చెరిపేశాడంటూ వాపోయాడు.

శంక‌ర్ తో డిస్కష‌న్ సంద‌ర్బంగా గేమ్ ఛేంజ‌ర్ చిత్రం కోసం క‌థ ను బ్రీఫ్ గా చెప్పాను. ఓ సాధార‌ణ ఐఏఎస్ అధికారి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎలా మారాడు అనేది కీ పాయింట్. చాలా గొప్పగా చూపిస్తాడ‌ని అనుకున్నాన‌ని, కానీ పూర్తిగా త‌న‌కు తోచిన‌ట్టు తీసుకుంటూ పోయాడ‌ని, చివ‌ర‌కు డిజాస్ట‌ర్ గా మిగిలి పోయింద‌న్నాడు కార్తీక్ సుబ్బ‌రాజ్. తాజాగా డైరెక్ట‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి కోలీవుడ్ లో.

Also Read : Sarangapani Jathakam Sensational : న‌వ్వుల లోకం సారంగ‌పాణి జాత‌కం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com