Kayadu Lohar : నేచురల్ స్టార్ నాని హాట్ టాపిక్ గా మారాడు. తను నటించిన శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ -3 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 130 కోట్లకు పైగా వసూలు చేసింది. తను నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారాడు. తాను తీసిన కోర్ట్ బంపర్ హిట్ గా నిలిచింది. ఈ తరుణంలో కీలక అప్ డేట్ వచ్చింది. నేచురల్ స్టార్ నటిస్తున్న మరో మూవీ ది ప్యారడైజ్ చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ మూవీకి సంబంధించి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Kayadu Lohar Movie With Natural Star Nani
అయితే ది ప్యారడైజ్ గురించి ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. మారి ముత్తు తీసిన చిత్రం డ్రాగన్. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు హీరో ప్రదీప్ రంగనాథన్ కు జోడీగా. ఒకరు అనుపమ పరమేశ్వరన్ కాగా మరొకరు కాయాదు లోహర్(Kayadu Lohar). ఈ చిత్రాన్ని తమిళం, తెలుగులో విడుదల చేశారు. ఎవరూ ఊహించని రీతిలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా రూ. 130 కోట్లకు పైగా వసూలు చేసి విస్తు పోయేలా చేసింది.
విచిత్రం ఏమిటంటే ప్రదీప్ రంగనాథన్ నటన మెస్మరైజ్ చేస్తే అనుపమ కంటే కయాదు లోహర్ సెన్సేషన్ గా నిలిచింది. దేశ వ్యాప్తంగా నేషనల్ క్రష్ గా మారి పోయింది. మొత్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా యువత గుండెలను మీటింది. తన నటనతో పాటు అందం కూడా ఆకట్టుకునేలా చేసింది. ఈ సమయంలో ది ప్యారడైజ్ మూవీకి సంబంధించి తనతో దర్శక, నిర్మాతలు టచ్ లోకి వెళ్లారని, నానికి జోడీగా నటింప చేసేందుకు ఒప్పించినట్లు సమాచారం. అయితే కన్ ఫర్మ్ చేశారా లేదా అన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మూవీ మేకర్స్.
Also Read : Popular Director Rajamouli :దర్శక ధీరుడు జక్కన్న కామెంట్స్ వైరల్
