ఆర్తి ప్ర‌కాశ్ కు కెనీషా ఫ్రాన్సిస్ లీగ‌ల్ నోటీస్

ర‌వి మోహ‌న్ కు ఆర్తి ప్ర‌కాశ్ నోటీస్

త‌మిళ సినీ రంగానికి చెందిన జ‌యం ర‌వి , ఆర్తి ప్ర‌కాష్ మ‌ధ్య నెల‌కొన్న విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరు చివ‌ర‌కు విడాకుల దాకా వెళ్లింది. త‌ను కొన్నేళ్ల పాటు బాగున్నాడ‌ని, ఎప్పుడైతే సింగ‌ర్ కెనీషా ఫ్రాన్సిస్ తో స్నేహం చేశాడో ఆనాటి నుంచి త‌మ మ‌ధ్య దూరం పెరిగింద‌ని వాపోయింది ఆర్తి ప్ర‌కాశ్. ఈ సంద‌ర్బంగా త‌న‌ను ఇన్ వాల్వ్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది గాయ‌కురాలు కెనీషా ఫ్రాన్సిస్.

ఈ సంద‌ర్బంగా ఆర్తి ప్ర‌కాశ్ నుంచి త‌న‌కు ప్రాణ భ‌యం ఉంద‌ని వాపోయింది. త‌న త‌ర‌పు నుంచి చంపుతామంటూ మెయిల్స్ , ఫోన్స్ బెదిరింపులు వ‌స్తున్నాయంటూ ఆవేద‌న చెందింది. ఈ సంద‌ర్బంగా త‌న‌కు భ‌ద్ర‌త లేకుండా పోయిందని కోర్టును ఆశ్ర‌యించింది. ఈ మేర‌కు జ‌యం ర‌వి తొలి భార్య ఆర్తి ప్రకాశ్ కు కోర్టు నుంచి లీగ‌ల్ నోటీసులు పంపించింది. త‌న‌కు ఏం జ‌రిగినా అది పూర్తిగా మీదే బాధ్య‌త అంటూ స్ప‌ష్టం చేసింది జారీ చేసిన నోటీసులో. త‌న‌ను రేప్ చేస్తామ‌ని , చంపేస్తామంటూ పేర్కొంది. ఇదిలా ఉండ‌గా కెనిషా ఫ్రాన్సిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్‌లైన్ పరువు నష్టంపై చట్టపరమైన ప్రకటనను పంచుకున్నారు.

ఇందులో ఇలా ఉంది. ఈ చర్యలు భారతీయ న్యాయ సంహిత, 2023 ప్రత్యక్ష ఉల్లంఘనలకు సమానం, వీటిలో సెక్షన్ 75 (అస్వాంఛనీయమైన ముందుకు రావడం లేదా లైంగిక రంగు పులుముకునే వ్యాఖ్యల ద్వారా లైంగిక వేధింపులు), సెక్షన్ 351 (నేరపూరిత బెదిరింపు), సెక్షన్ 356 (పరువు నష్టం), అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని బహుళ నిబంధనలు, సెక్షన్ 66E (గోప్యత ఉల్లంఘన), సెక్షన్ 67 సెక్షన్ 67 A (ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల కంటెంట్ ప్రచురణ లేదా ప్రసారం) ఉన్నాయని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com