త‌ప్పు చేస్తే శిక్ష ప‌డేందుకు సిద్దంగా ఉన్నా

సింగ‌ర్ కెనిషా ఫ్రాన్సిస్ షాకింగ్ కామెంట్స్

జ‌యం ర‌వి , ఆర్తి ప్ర‌కాశ్ మ‌ధ్య చోటు చేసుకున్న విభేదాలు చివ‌ర‌కు త‌న ప్రాణం మీద‌కు వ‌చ్చాయంటూ వాపోయింది ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సింగ‌ర్ కెనిషా ఫ్రాన్సిస్. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఈ మ‌ధ్య‌న ఈవెంట్స్ లో కిన‌పించ‌డం క‌ల‌క‌లం రేపింది. చివ‌ర‌కు ఇద్ద‌రూ డేటింగ్ లో ఉన్నార‌ని, ప్రేమ‌కు దారి తీసింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. త‌మ‌కు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్ర‌యించారు. అంతే కాకుండా త‌న దావాలో నెల‌కు రూ. 40 ల‌క్ష‌లు భ‌ర‌ణంగా ఇవ్వాల‌ని ఆర్తి ప్ర‌కాశ్ కోరింది.

ఈ స‌మ‌యంలో జ‌యం ర‌వి సంచ‌ల‌న లేఖ రాశారు. త‌న‌ను చిత్ర‌హింస‌లు పెట్టింద‌ని, అప్పులపాలు చేసిందని, చివ‌ర‌కు అప్పుల బాధ ప‌డ‌లేక తాను రోడ్డు మీద ప‌డ్డానంటూ వాపోయాడు. త‌న‌కు ఆమె నుంచి విడాకులు కావాల‌ని కోరింది. ఈ ఇద్ద‌రికి ఇద్ద‌రు కొడుకులు. ఆర్తి ప్రకాష్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. సింగ‌ర్ కెనిషా ఫ్రాన్సిస్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ సంద‌ర్బంగా సీరియ‌స్ గా స్పందించింది గాయ‌ని.

జ‌యం రవి తాను మంచి ఫ్రెండ్స్ మాత్ర‌మేన‌ని, తామిద్ద‌రి మ‌ధ్య అలాంటిది ఏమీ లేద‌ని పేర్కొంది. త‌ను త‌న‌ను అపార్థం చేసుకుందంటూ ఆర్తి ప్ర‌కాష్ గురించి. తాను ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. తాను త‌ప్పు చేస్తే చ‌ట్టం ద్వారా శిక్షించ బ‌డేందుకు సిద్దంగా ఉన్నాన‌ని పేర్కొంది. జ‌యం ర‌వి మాజీ భార్య ఆర్తి ప్ర‌కాష్ నుంచి త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయంటూ వాపోయింది. నిజ‌మ‌ని తేలితే ఏ శిక్ష వేసినా భ‌రించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com