అమెరికాను వీడిన టిక్ టాక్ స్టార్ ఖాబీ లేమ్

వ‌ర‌ల్డ్ వైడ్ గా అత్యంత జ‌నాద‌ర‌ణ పొందాడు

అమెరికా – ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్ స్టార్ ఖాబీ లేమ్‌ను ICE అదుపులోకి తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ తర్వాత అమెరికా వదిలి వెళ్లారు. సెనెగల్-ఇటాలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉన్నారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. అయితే బహిష్కరణ ఉత్తర్వు లేకుండా దేశం విడిచి వెళ్లడానికి అనుమతించబడ్డారు చివ‌ర‌కు. దీంతో ఊపిరి పీల్చుకున్నాడు ఖాబీ లేమ్.

ఇదిలా ఉండ‌గా ఖాబీ లేమ్ కు వ‌ర‌ల్డ్ వైడ్ గా ల‌క్ష‌లాది మంది అనుచ‌రులు ఉన్నారు. త‌న‌ను పెద్ద ఎత్తున ఫాలో అవుతున్నారు. అస‌లు పేరు సెరెంజ్ ఖబానే లేమ్ . కాగా బహిష్కరణ ఉత్తర్వు లేకుండా దేశం విడిచి వెళ్లడానికి అనుమతించబడ్డారని US ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ప్రతినిధి ధ్రువీక‌రించారు ఈ సంద‌ర్బంగా.

ఖాబీ లేమ్ గ‌త ఏప్రిల్ 20న అమెరికాకు చేరుకున్నాడు. త‌న వీసా గ‌డువు ముగిసింద‌ని ఈమెయిల్ ద్వారా విదేశాంగ శాఖ తెలియ చేసింద‌ని, అయినా త‌ను ప‌ట్టించు కోలేద‌ని అమెరికా ఇమ్మిగ్రేష‌న్ అధికారి ఆరోపించారు. దీంతో త‌న‌ను అద‌పులోకి తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నాడు. త‌న‌ను అరెస్ట్ చేయ‌డం, ఆ త‌ర్వాత రిలీజ్ చేయ‌డంపై ఎలాంటి కామెంట్ చేసేందుకు ఇష్ట ప‌డ‌లేదు ఖాబీ లేమ్. త‌న వ‌య‌సు కేవ‌లం 25 ఏళ్లు మాత్ర‌మే. సెనెగ‌ల్ లో పుట్టాడు. ఇటాలియ‌న్ పౌర‌స‌త్వం పొందాడు. 2022లో డిజైన‌ర్ బ్రాండ్ హ్యూగో బాస్ తో సంత‌కం చేశాడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com