Khushi Kapoor: యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ‘ఉప్పెన’. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా గా విడుదలైన ‘ఉప్పెన’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడీ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీకపూర్ హీరోహీరోయిన్లుగా… బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RC16” పూజా కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్వయంగా వెల్లడించారు.
Khushi Kapoor Movie Update
రామ్ చరణ్ తాజా చిత్రం RC16 పూజా కార్యక్రమానికి జాన్వీతో పాటు హాజరయిన బోనీకపూర్ మాట్లాడుతూ.. ‘బుచ్చిబాబు ‘ఉప్పెన’ చూశాను. చాలా నచ్చింది. దీన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నా చిన్న కూతురు ఖుషీ కపూర్‌ను(Khushi Kapoor) కూడా ‘ఉప్పెన’ చూడమని చెప్పాను’ అన్నారు. దీనితో త్వరలోనే ఈ చిత్రం రీమేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇందులో హీరోగా ఎవరిని తీసుకుంటారు… తెలుగులో హిట్ అయినట్లు హిందీలోనూ అవుతుందా… అంటూ అప్పుడే బాలీవుడ్ లో రకరకాల కథనాలు మొదలయ్యాయి.
ఇప్పటికే ఖుషీ కపూర్ రెండు క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ ఖాన్, సైఫ్ అలీఖాన్ కుమారుల సినిమాల్లో ఆమె నటించనున్నారట. కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ‘నాదనియాన్’ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఖుషీని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, అమీర్‌ఖాన్ కుమారుడు జువైద్ ఖాన్‌తోనూ ఆమె జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో విజయం సాధించిన ‘లవ్‌టుడే’ను బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారని… ఇందులో జువైద్ సరసన ఆమె నటించనున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే త్వరలోనే జాన్వీలానే ఖుషీ కూడా వరుస సినిమాలతో బిజీ అయ్యేలా కనిపిస్తున్నారు.
Also Read : Veppam Kulir Mazhai : సరికొత్త కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న సినిమా
