టాలీవుడ్ లో వెరీ వెరీ స్పెషల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. తను తీసింది కొన్ని చిత్రాలే కానీ ప్రతి ఒక్కటీ సక్సెసే. కాలేజ్ డేస్, గోదావరి, ఫిదా , డాలర్ డ్రీమ్స్ ..ఇలా ప్రతి మూవీ సూపర్. తాజాగా కుబేర తో వస్తున్నాడు. ఈ సినిమాపై సైలెంట్ గా అంచనాలు పెంచేలా చేశాయి. తనకు మినిమం గ్యారెంటీ కలిగిన డైరెక్టర్ గా గుర్తింపు ఉంది. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా చేస్తాడన్న పేరుంది. అందుకే తన జానర్ కు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ హీరో ధనుష్ కీ రోల్ పోషిస్తుండగా మరో పాత్రలో నటిస్తున్నాడు కింగ్ నాగార్జున. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చిందని సమాచారం. డబ్బింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. తాజాగా కీలక అప్ డేట్ ఇచ్చాడు . నాగార్జున డబ్బింగ్ చేస్తుండగా తీసుకున్న ఫోటోలు పంచుకున్నాడు. ఇప్పుడు ఇవి వైరల్ గా మారాయి.
నిన్ననే హైదరాబాద్ లో తన నివాసంలో కొడుకు అఖిల్ అక్కినేని, రవిడ్జీ పెళ్లి పూర్తయింది. ఈనెల 8వ తేదీన ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయినా ఓ వైపు పెళ్లి అయినా ఎక్కడా తగ్గడం లేదు. తనకు ఉన్న నిబద్దతను చాటుకున్నాడు నాగార్జున. ఇక కుబేరలో ధనుష్ దేవా పాత్రలో జీవించగా జిమ్ సర్ఫ్ , రష్మిక మందన్నా కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. కుబేర మూవీని జూన్ 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని వెల్లడించారు.