టాలీవుడ్ లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేసిన చిత్రాలు కొన్నే కానీ మంచి నటుడిగా పేరు పొందాడు. ఎవరి సహకారం లేకుండానే ఒంటరిగానే ముందుకు సాగుతున్నాడు. కీలకమైన పాత్రలు ఎంపిక చేసుకునేందుకు ప్రయారిటీ ఇస్తున్నాడు. తను నటించిన చిత్రం క సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. సినీ విమర్శకుల ప్రశంసలు పొందింది కూడా. తన నటనకు వంద మార్కులు పడ్డాయి.
తాజాగా యువ నటి శ్రీ గౌరీ ప్రియతో కలిసి కిరణ్ అబ్బవరం కొత్త చిత్రంతో జత కట్టాడు. ఆ మూవీకి సంబంధించి టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. దీనికి సంబంధించిన గ్లింప్స్ ను ఇవాళ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. దాని పేరు చెన్నై లవ్ స్టోరీ. సాయి రాజేష్, ఎస్కేఎన్ లు కలిసి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే టాప్ ఇండియన్ డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి సామాజిక మాధ్యమం ద్వారా చెన్నై లవ్ స్టోరీ గ్లింప్స్ ను రిలీజ్ చేయడం విశేషం. ఈ సందర్బంగా వంగా ప్రశంసలు కురిపించాడు. తాను సామాన్యంగా దేనిని మెచ్చుకోడు. తనకు నచ్చితేనే తప్పా. తను ఇతర దర్శకుల లాంటి వాడు కాదు. తన మేకింగ్ , టేకింగ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
అందుకేనేమో చెన్నై లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ప్రేమ అన్నది నిరంతరం. దానికి మొదలు ఉండదు చివర అనేది కానే కాదంటూ పేర్కొన్నాడు. ఈ కథ , కాన్సెప్ట్ తనకు విపరీతంగా నచ్చిందన్నాడు వంగా సందీప్ రెడ్డి.