Kiran Abbavaram : సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు హీరో

కాగా గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించాడు కిరణ్ అబ్బవరం...

Hello Telugu - Kiran Abbavaram

Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం (అక్టోబర్ 27)ఉదయం ఆయన వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు కిరణ్ అబ్బవరం కు సాదర స్వాగతం పలికారు. ఇక దర్శనానంతరం హీరోకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తన లేటెస్ట్ మూవీ క సూపర్ హిట్ కావాలని శ్రీవారిని కోరుకున్నానని కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తెలిపాడు. కాగా ఈ హీరో రాకను గమనిచిన భక్తులు అతనితో ఫొటోలు, సెల్పీలు దిగేందుకు ఎగబడ్డారు. కిరణ్ కూడ ఎంతో ఓపికగా అడిగిన వారందరితో ఫొటోలు దిగాడు. సెల్ఫీలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించాడు కిరణ్ అబ్బవరం. వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు రిలీజ్ చేయగా, వినరో భాగ్యము విష్ణు కథ ఒక్కటే డీసెంట్ హిట్ గా నిలిచింది. మిగిలిన రెండు సినిమాలు తీవ్రంగా నిరాశపర్చాయి.

Kiran Abbavaram Visited…

ఈ క్రమంలోనే కొద్దిగా గ్యాప్ తీసుకుని ఏకంగా పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. పీరియాడిక్ థ్రిల్లర్ గా రూపొందిన క సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై కూడా పాజిటవ్ బజ్ క్రియేట్ అయ్యింది. క సినిమాలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్‌గా కనిపించనున్నాడు. కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

Also Read : Anju Kurian : కుర్రాళ్ళ గుండెల్లో గునపం దించిన మలయాళ భామ ‘అంజు కురియన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com