KL Rahul : ముంబై – టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి భారత క్రికెట్ జట్టు నాయకుడు రోహిత్ శర్మ తప్పుకుంటున్నట్లు ప్రరకటించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ కుదుపునకు లోనయ్యారు. ఆడే సత్తా ఉన్నప్పటికీ తనతో పాటు విరాట్ కోహ్లీ తప్పుకోవడం చర్చకు దారితీసింది. ఈ తరుణంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ , బీసీసీఐ బాస్ జే షా మదిలో ఎవరు ఉన్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు రోహిత్ శర్మ ప్లేస్ లో పలువురు ఆటగాళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
KL Rahul Sensational in Skipper Race
ప్రస్తుతం ఐపీఎల్ 2025 మెగా టోర్నీ జూన్ 3తో ముగియనుంది. ఎవరూ ఊహించని రీతిలో పలువురు కీలక ఆటగాళ్లు కీలక భూమిక పోషించారు. వీరిలో సంజూ శాంసన్ , రిషబ్ పంత్ , కేఎల్ రాహుల్(KL Rahul), శుభ్ మన్ గిల్, జస్ ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ లను పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు తను కెప్టెన్ గా ఉన్నాడు. ఆశించిన మేర జట్టు ప్రదర్శన లేక పోవడంతో ఓనర్ సంజీవ్ గోయెంకా తో గొడవ పడ్డాడు.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ లో భాగమైన కేఎల్ రాహుల్ సూపర్ షో చేశాడు. భారీ పరుగులు సాధించాడు. తమ ఢిల్లీ జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. గతంలో భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ తరుణంలో తనను రోహిత్ శర్మ ప్లేస్ లో భర్తీ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
Also Read : Gautam Gambhir Shocking Decision :భారత జట్టు కెప్టెన్ ఎంపికపై ఉత్కంఠ