Kolkata Students Sensational :కేన్స్ ఫెస్టివ‌ల్ కు కోల్ క‌తా విద్యార్థుల షార్ట్ ఫిలిం

ఎ డాల్ మేడ్ అప్ ఆఫ్ క్లే పేరుతో ఆక‌ట్టుకుంటోంది

Kolkata Students Sensational

Kolkata Students : ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ 2025కి భార‌త దేశంలోని కోల్ క‌తా(Kolkata) కు చెందిన విద్యార్థులు రూపొందించిన ల‌ఘు చిత్రం (షార్ట్ ఫిలిం) ఎ డాల్ మేడ్ అప్ ఆఫ్ క్లే ఎంపికైంది. ఈ స్టూడెంట్స్ ఎవ‌రో కాదు ప్ర‌ముఖ సంస్థ స‌త్య‌జిత్ రే ఫిలిం, టెలివిజ‌న్ ఇనిస్టిట్యూట్ (ఎస్ఆర్ఎఫ్‌టీఐ) లో చ‌దువుకుంటున్న వారే. ప్ర‌స్తుతం విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. హృద‌యాల‌ను మెలిపెట్టేలా తీశారంటూ పేర్కొన‌డం విశేషం. ఈ ఏడాది నిర్వ‌హించే ఫిలిం ఫెస్టివ‌ల్ 78వ‌ది.

Kolkata Students Short Film for Cannes Festival

ఈ షార్ట్ ఫిలిం లా సినీఫ్ విభాగానికి ఎంపికైంది. ప్ర‌పంచంలోని ఔత్సాహిక ప‌ర‌మైన విద్యార్థుల‌కు స్పూర్తి దాయ‌కంగా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక ఈ క‌థ 23 ఏళ్ల నైజీరియ‌న్ ఫుట్ బాల్ ఆట‌గాడు అహ్మ‌ద్ ను అనుస‌రిస్తుంది. త‌ను మొద‌ట కోల్ క‌తాలో ఫుట్ బాల్ ఆడేందుకు వ‌చ్చాడు త‌న దేశం నుంచి. కానీ చివ‌ర‌కు న‌టుడిగా కెమెరా ముందు క‌నిపించాడు. ఎ డాల్ మేడ్ అప్ ఆఫ్ క్లే ల‌ఘు చిత్రానికి ఇథోయోపియ‌న్ విద్యార్థి కోకోబ్ గెబ్రే హ్వేరియా టెస్పే ర‌చించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సాహిల్ మ‌నోజ్ ఇంగ్లే నిర్మించాడు.

త‌న‌తో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు ఉమా కుమారి. ఈ సంద‌ర్బంగా త‌ను మాట్లాడుతూ హర్యానాలోని ఒక చిన్న పట్టణం రేవారి నుండి వచ్చి, ఇప్పుడు కేన్స్ వంటి ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం ఒక కలలా అనిపిస్తుందన్నారు. నాకు మాత్రమే కాదు, సినిమాను తరచుగా ఆచరణీయమైన కెరీర్‌గా చూడని ప్రదేశాల నుండి వచ్చిన ప్రతి యువత‌ కలలు కనేవారికి ఆలంబ‌నంగా నిలుస్తుంద‌న్నారు. దుర్భేద్య‌మైన క‌ల‌ను క‌ష్ట‌ప‌డితే నిజం చేసుకోవ‌చ్చ‌ని ఈ ల‌ఘు చిత్రం నిరూపించింద‌న్నారు.

Also Read : Beauty Anupama Parameswaran : పీరియాడిక్ మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com