Hit-3 : టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకు పోతున్నాడు నేచురల్ స్టార్ నాని. తను నటనతో పాటు నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడు. తాజాగా తను తీసిన కోర్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా కొత్త మూవీస్ పై ఫోకస్ పెట్టాడు. హిట్ -3, ది ప్యారడైజ్ చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించాడు నాని. హిట్ 3కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.
Hit-3 – Keerthy Suresh In..
ఈ మధ్యన జరిగిన ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు నాని. హిట్ 3(Hit-3) హిట్ కావడం పక్కా అని ప్రకటించాడు. ఈ సినిమాకు దర్శకుడే కథ రాశాడు. ప్రశాంత్ త్రిపురనేని హిట్ 3 చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నానితో పాటు శ్రీనిధి శెట్టి , అడవి శేష్ , విశ్వక్ సేన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా ఓ కీలకమైన అప్ డేట్ వచ్చింది. కోలీవుడ్ లో సహజ సిద్దమైన నటనకు పేరు పొందిన నటుడు కార్తీ. ఈ సందర్బంగా తను కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా కార్తీ కూడా ఓకే చెప్పాడని సినీ వర్గాల నుంచి తెలిసింది. ఇక హిట్ 3 మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు నాని. దీనిని వచ్చే మే నెల 1వ తేదీన విడుదల చేయాలని మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారు. సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు. అయితే కార్తీపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని , కానీ మూవీ మేకర్స్ నుంచి ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
Also Read : Popular Director Sukumar :పుష్ప రాజ్ పేరు వెనుక పెద్ద కథ
