కొన్ని కథలు భిన్నంగా ఉంటాయి. ఇంకొన్ని ఆకట్టుకుంటే మరికొన్ని ఆలోచింప చేస్తాయి. ఇలాంటి వాటిని తీయాలంటే కొంత అభిరుచి ఉండాలి. అంతకు మించి పట్టుదల, సినిమాల పట్ల పేషన్ ఉండాలి. అలాంటి కోవకు చెందిన వ్యక్తి కన్నడ సూపర్ స్టార్ , ప్యాన్ ఇండియా హీరో యశ్ కన్నతల్లి పుష్ప కూడాను. ఎవరూ ఊహించ లేదు తను నిర్మాతగా మారుతారని. కానీ ఎందుకనో తన కొడుకుతో సినిమా తీయకుండా ఇంకొకరితో మూవీ తీయడం విస్తు పోయేలా చేసింది. ఈ సందర్బంగా పుష్ప చెప్పిన మాటలు ఇప్పుడు దేశమంతటా వైరల్ గా మారాయి.
తన కొడుక్కి తరగనంత కోట్లున్నాయని, లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నాయని కానీ కడుపు నిండిన వాడితో సినిమా తీస్తే ఏం లాభం అంటూ ప్రశ్నించింది. అదే ఆకలితో ఉన్న వాళ్లకు ఛాన్స్ లు ఇస్తే వాళ్లకు న్యాయం చేసినట్టు అవుతుందని స్పష్టం చేసింది పుష్ప. తను నిర్మించిన చిత్రమే కొత్తలవాడి. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. రిలీజ్ అయిన లోపే మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుంది. మంచి ఆదరణ చూరగొంది. సినిమాపై మరింత అంచనాలు పెంచేలా చేసింది.
పుష్ప కేవలం కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకే పుష్ప అరుణకుమార్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. కేవలం సినిమా పట్ల నిబద్దత, ప్రతిభ ఉంటే చాలు ఛాన్స్ లు ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిందే తాజా కొత్తలవాడి. పార్వతమ్మ, రాజ్ కుమార్ లను ఆదర్శంగా తీసుకుని దీనిని ఏర్పాటు చేశామన్నారు. సిరాజ్ రాసి, దర్శకత్వంలో రూపు దిద్దుకుంది. ఇందులో పృథ్వీ అంబార్ హీరోగా నటించాడు.
అభినందన్ కశ్యప్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఈ చిత్రాన్ని చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట తాలూకాలోని పల్లె. దీనిలోనే ఎక్కువగా చిత్రీకరించారు. గ్రామీణ నేపథ్యం, సంభాషణలు అన్నీ అలరించేలా ఉన్నాయి. పృథ్వీ తో పాటు రాజేష్ , అవినాష్, కావ్య శైవ, మన్షి సుధీర్, రఘు రమణ, చేతన్ గంధర్వ , గోపాల్ దేశ్ పాండే ఇతర పాత్రల్లో నటించారు.
