హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఇదే సమయంలో నేషనల్ హెరాల్డ్ కేసులో రూ. 142 కోట్లు చేతులు మారాయని, ఇందులో ప్రధాన భూమిక సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డికి కూడా పాత్ర ఉందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బట్ట బయలు చేసిందన్నారు. పూర్తి నివేదికను ఢిల్లీలోని రాస్ ఎవెన్యూ కోర్టుకు సమర్పించిందన్నారు. మొత్తం వివరాలు బయటకు వచ్చాయని, అయినా నిత్యం నీతులు వల్లించే రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు.
స్కాంలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. ఈ కేసులో సీఎం అవినీతి తారా స్థాయికి చేరిందని తేలి పోయిందన్నారు. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇస్తే పోస్టులు ఇప్పిస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పవర్ లోకి రాక ముందే కాంగ్రెస్ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టారనే నిజాన్ని ఈడీ తేల్చిందన్నారు. ఇకనైనా విచారణకు ఆదేశించాలని, తక్షణమే రేవంత్ ను పదవి నుంచి ఊడబెరకాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
ఈ మొత్తం వ్యవహారంపై పార్టీ ప్రజలకు అసలు వాస్తవాలు ఏమిటో తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు . లేకపోతే ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. పొద్దస్తమాన ఇతరులను టార్గెట్ చేయడం తప్పితే సీఎంకు , కాంగ్రెస్ పార్టీకి పనేమీ లేదన్నారు. ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన ఘనత మీకే దక్కుతుందన్నారు కేటీఆర్.