లావ‌ణ్య త్రిపాఠి బేబీ బంప్ ఫోటోస్ వైర‌ల్

సోష‌ల్ మీడియాలో తేజ్, త్రిపాఠి హ‌ల్ చ‌ల్

మెగా ఫ్యామీలో ఫుల్ ఖుష్ లో ఉంది. దీనికి కార‌ణం త‌మ కుటుంబానికి చెందిన హీరో, హీరోయిన్లుగా పేరు పొందిన వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠిలకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ ఇద్ద‌రూ స‌మ్మ‌ర్ వెకేష‌న్స్ కోసం మాల్దీవులలో సేద దీరారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సామాజిక మాధ్య‌మాల ద్వారా పంచుకున్నారు. అయితే లావ‌ణ్య త్రిపాఠి క‌డుపుతో ఉండ‌డం , బేబీ బంప్ ఫోటోల‌ను స్వ‌యంగా షేర్ చేయ‌డంతో తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు త‌ల్లిదండ్రులు. త‌న తండ్రి ఎవ‌రో కాదు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు , చిరంజీవికి త‌మ్ముడు , న‌టుడు , జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ కొణిద‌ల నాగ‌బాబు.

త్వ‌ర‌లోనే త‌ను తాత కాబోతున్నాడు. వ‌రుణ్ తేజ్, లావణ్య పేరెంట్స్ కాబోతున్నారు. పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌ను ఇవ్వ బోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీలో సంబురాలు ఇప్ప‌టి నుంచే మొద‌లు పెట్టారు. చాలా గ్రాండ్ గా ఈ ఇద్ద‌రి పెళ్లి జ‌రిపించారు మెగా స్టార్స్. కాగా చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు తేజ్, త్రిపాఠిలు. ఆ తర్వాత 2023లో వివాహం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం మాల్దీవుల్లో ప్రశాంతమైన సెలవులను ఆస్వాదిస్తున్నారు. వీరి ఇటీవలి చిత్రాలు సోషల్ మీడియాను తుఫానుగా మార్చాయి, బీచ్‌సైడ్ క్లిక్‌లలో లావణ్య బేబీ బంప్ కనిపిస్తుండ‌డం విశేషం.

ఈ సంవత్సరం మే నెలలో వరుణ్ తేజ్ అధికారికంగా లావణ్య గర్భధారణను హృదయ పూర్వక పోస్ట్ ద్వారా ప్రకటించాడు, ఇది దేశవ్యాప్తంగా అభిమానులను సంతోషపెట్టింది. అప్పటి నుండి, ఈ ప్రత్యేక దశలో ఈ జంట గోప్యతను ఎంచుకుంటూ, అందరి దృష్టికి దూరంగా ఉంది. కాగా లావ‌ణ్య ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌లో, వెబ్ సీరీస్ ల‌లో న‌టించింది. పెళ్లి త‌ర్వాత వాటికి దూరంగా ఉంది. త‌ల్లి అయ్యాక పూర్తిగా సినిమాల‌కు దూరం కానున్న‌ట్లు టాక్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com