జోసెఫ్ విజయ్ , త్రిష కృష్ణన్ కలిసి నటించిన లియో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మూవీ మేకర్స్ డేట్ ఫిక్స్ చేసింది. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఇందులో ప్రతి నాయకుడి పాత్రలో మెప్పించాడు నటుడు సంజయ్ దత్.
లియో చిత్రానికి సంబంధించి రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ పోయింది. ఒక్కో పోస్టర్ దుమ్ము రేపింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కలిగి ఉన్నాడు తళపతి విజయ్. బీస్ట్ మూవీ ఆశించిన మేర రాలేదు.
ఆదివారం లియో మూవీ ఆడియో లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తళపతి జోసెఫ్ విజయ్ అభిమానులు హాజరయ్యారు. భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రంపై. తనదైన మార్క్ ను ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.
ఇక లియో చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన ట్రైలర్ రికార్డ్ బ్రేక్ చేసింది. భారీ ఎత్తున వ్యూయర్స్ ఆదరిస్తున్నారు ఈ సినిమాను. భారీ ఖర్చుతో తీసిన ఈ చిత్రం రికార్డు బ్రేక్ చేసేందుకు రెడీ అయ్యింది. మొత్తం మీద లియోపై నమ్మకం పెట్టుకున్నారు విజయ్.
