Leo Movie Poster : విజ‌య్ లియో పోస్ట‌ర్ సూప‌ర్

లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోగా ఉన్న జోసెఫ్ విజ‌య్ న‌టించిన లియోపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్ టాప్ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించే ద‌మ్మున్న న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్.

ద‌ర్శ‌కుడు విచిత్ర‌మైన పేరు పెట్టాడు. ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. విజ‌య్ మేనియా మామూలుగా ఉండ‌దు. భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించాడు. యాక్ష‌న్ , థ్రిల్ల‌ర్ గా తీశాడు. ర‌త్న కుమార్ , దీర‌జ్ వైద్య తో క‌లిసి క‌థ‌ను రాశాడు లోకేష్ క‌న‌గ‌రాజ్.

సెవ‌న్ స్కీన్ స్టూడియోస్ పై ఎస్ఎస్ ల‌లిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. జ‌గ‌దీష్ ప‌ళ‌ని సామి స‌హ నిర్మాత‌గా ఉన్నాడు. ఈ లియో చిత్రంలో జోసెఫ్ విజ‌య్ తో పాటు త్రిష కృష్ణ‌న్ , సంజ‌య్ ద‌త్ , అర్జున్ స‌ర్జా, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ , మ‌న్సూర్ అలీ ఖాన్ , మిస్కిన్ న‌టించారు.

టేకింగ్ లో , మేకింగ్ లో డిఫ‌రెంట్ గా తీస్తాడ‌న్న పేరుంది లోకేష్ క‌న‌గ‌రాజ్ కు. విజ‌య్ కూడా ఈ చిత్రంపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాడు స‌క్సెస్ అవుతుందని. అక్టోబ‌ర్ 19న విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ నిర్ణ‌యించారు. ఇక విజ‌య్ సినీ కెరీర్ లో ఇది 67వ చిత్రం కావ‌డం విశేషం.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com