Leo Movie : అబ్బా లియో దెబ్బ

మిగ‌తా సినిమాల‌పై ప్ర‌భావం

త‌మిళ సినీ రంగానికి చెందిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ తీసిన లియో ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తోంది. రాష్ట్ర స‌ర్కార్ ఎన్ని అవాంత‌రాలు క‌ల్పించినా అభిమానుల ముందు దిగ‌దుడుపేన‌ని తేలి పోయింది. ఇటు ఇండియాలో అటు ఓవ‌ర్సీస్ లో క‌లెక్ష‌న్ల వేట కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే మ‌రో ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్ తీసిన పాన్ ఇండియా మూవీ జ‌వాన్ రికార్డ్ బ్రేక్ చేసింది.

తాజాగా స్టార్ హీరో ద‌ళ‌ప‌తి జోసెఫ్ విజ‌య్ , త్రిష కృష్ణ‌న్, సంజ‌య్ ద‌త్ , అర్జున్ క‌లిసి న‌టించిన లియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తుండ‌గా ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. ఇక వ‌రుస సినిమాల‌తో మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన అనిరుధ్ ర‌విచంద‌ర్ మ‌రోసారి త‌నదైన మార్క్ తో ఆక‌ట్టుకున్నాడు. లియోకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వారెవ్వా అనేలా చేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 19న విడుదల కావ‌డంతో కోట్లాది మంది అభిమానులు కెవ్వు కేక అంటున్నారు. ప్ర‌స్తుతం విడుద‌ల‌కు ముందే రూ. 120 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది లియో చిత్రం. ఇదిలా ఉండ‌గా లియో ఎఫెక్ట్ తెలుగు చిత్రాల‌పై ప‌డుతోంది. బాల‌కృష్ణ, శ్రీ‌లీల , కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి, ర‌వితేజ‌, నుపుర్ స‌న‌న్ న‌టించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు చిత్రాల‌ను ప‌ట్టించు కోవ‌డం లేద‌న్న టాక్ కొన‌సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com