తమిళ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పవర్ ఫుల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది జోసెఫ్ విజయ్. ఆయనను అంతా తలపతి అని పిలుచుకుంటారు. ఈ ఇండస్ట్రీలో డిఫరెంట్ మేనరిజం ప్రదర్శించే అతి కొద్ది మంది నటుల్లో తను కూడా ఒకడు.
సక్సెస్ , పరాజయంతో పని లేకుండా సినిమాలు చేసుకుంటూ పోవడమే పనిగా పెట్టుకున్నాడు తళపతి. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో లియో మూవీ తీస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది.
లియోకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. స్వయంగా హీరో విజయ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తన సినిమాకు సంబంధించి ట్రైలర్ ను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో తళపతి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
విజయ్ నటించిన బీస్ట్ ఆశించిన మేర ఆడలేదు. దీంతో లియోపై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు. తనను డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కనగరాజ్. ఈ మూవీకి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం లియో పోస్టర్స్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.
