లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలకు తగ్గట్టు దర్శకుడు తీర్చిదిద్దాడు. టేకింగ్ లో మేకింగ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న డైరెక్టర్ గా పేరు పొందాడు కనగరాజ్ .
గతంలో తళపతి విజయ్ తో సినిమా చేశాడు. మరోసారి తన లక్ ను పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే చిత్రంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్ కిర్రాక్ తెప్పించేలా ఉన్నాయి. ఇక సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇవాళ సాయంత్రం భారీ ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య తళపతి విజయ్ లియో ట్రైలర్ విడుదల చేశారు. ఈ వేడుకను అంగరంగ వైభవంగా చెన్నైలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ అనుకోని ఇబ్బందుల వల్ల దానిని వాయిదా వేశారు మూవీ మేకర్స్.
తాజాగా ట్రైలర్ విజయ్ ఫ్యాన్స్ కు పండుగను తీసుకు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. లియో వేడుకకు భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు.