Lokesh Kanagaraj : సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ కీ రోల్ పోషిస్తున్న చిత్రం కూలీ. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ నటిస్తుండడం విశేషం. తను గతంలో తీసిన మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తను కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. దీనికి కారణం తన సినిమా ప్రమోషన్స్ బిజీలో ఉన్నానని, అందుకే తాను ప్రస్తుతానికి విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. తన టేకింగ్, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుందన్నాడు.
Lokesh Kanagaraj Shocking Comments
చిట్ చాట్ సందర్బంగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి సెటైర్స్ వేశాడు. తాను రాజమౌళి లాగా ఏళ్లకు ఏళ్లు సినిమా షూటింగ్ తీయనంటూ పేర్కొన్నాడు. కేవలం ఆరు నెలల్లోనే ముగించేస్తానని స్పష్టం చేశాడు. అంత టైం తీసుకోవడం వల్ల అవుట్ పుట్ రాదన్నాడు. అలా వస్తుందని అనుకోవడం కేవలం భ్రమ మాత్రమేనని పేర్కొన్నాడు లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj). ప్రపంచ వ్యాప్తంగా కూలీ కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తోందన్నాడు.
ఇదే సమయంలో కూలీ తర్వాత కొత్త ప్రాజెక్టు ఉంటుందన్నాడు. అది ఖైదీ 2 అని ప్రకటించాడు. దళపతి విజయ్ తో తీసిన లియోకు సీక్వెల్ కాకుండా మాస్టర్ 2 తీయాలని తనకు ఉందని చెప్పాడు లోకేష్ కనగరాజ్. తమిళ సినీ రంగానికి చెందిన సూపర్ స్టార్స్ తలైవా రజనీకాంత్ , ఇలయ నాయకన్ కమల్ హాసన్ లతో కలిపి ఓ గ్యాంగ్ స్టర్ కథతో సినిమా చేయాలని ఉందని తెలిపాడు. తను రాజమౌళి లాగా ఎక్కువ సమయం తీసుకునేందుకు ఇష్ట పడనని స్పష్టం చేశాడు. తను తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Beauty Trisha Temple :అభిమాన సంధ్రం త్రిషకు మందిరం
