మాధురీ బ‌ర్త్ డే గిఫ్ట్ ఓటీటీల్లో టాప్ మూవీస్

ఇండియాను షేక్ చేసిన ముద్దుగుమ్మ

Madhuri Dixit

భార‌తీయ వెండి తెర మీద ఎప్ప‌టికీ క‌ద‌లాడే న‌వోన్మిక మాధురీ దీక్షిత్. ఇన్నేళ్ల‌యినా , ఏజ్ పెరుగుతూనే ఉన్నా బాలీవుడ్ లో రేఖ‌, ర‌వీనా టాండ‌న్ తో పాటు త‌ను కూడా మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా త‌యార‌వుతోంది. ఈ మ‌ధ్య‌న ఈవెంట్స్ లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. ఈ నెల‌లోనే త‌ను పుట్టిన రోజు జ‌రుపుకుంది. మే 15న గురువారం త‌న బ‌ర్త్ డే. ఈ సంద‌ర్బంగా త‌న సినీ కెరీర్ లో అత్య‌ధిక విజ‌యాలు సాధించిన సినిమాల‌కు సంబంధించి ఫ్యాన్స్ కోసం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ల‌క్ష‌లాది అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ఇక సినిమాల ప‌రంగా చూస్తే మాధురీ దీక్షిత్ ఖాతాలో ఎన్నో ఉన్నాయి. వాటిలో 10 సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక అమీర్ ఖాన్ తో న‌టించిన దిల్ సూప‌ర్ హిట్ గా నిలిచింది. మ్యూజిక్ ప‌రంగా రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాదితో 58 ఏళ్లు నిండాయి. అనిల్ క‌పూర్, మాదురి న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ తేజాబ్ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఆనాడు ఏక్ దో తీన్ సాంగ్ రికార్డుల మోత మోగించింది. కుర్ర‌కారును కైపెక్కించేలా చేసింది.

ఇదే స‌మ‌యంలో త‌ను, అమీర్ న‌టించిన దిల్ మూవీ సైతం మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచింది. ఇది కూడా ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిన ప్రియురాలి క‌థే సాజ‌న్. న‌దీమ్ శ్ర‌వ‌ణ్ అందించిన సంగీతం, పాట‌లు కెవ్వు కేక అనిపించాయి. ఇందులో సంజ‌య్ ద‌త్, మాధురీ దీక్షిత్, స‌ల్మాన్ ఖాన్ క‌లిసి ప్రాణం పోశారు. పాట‌ల‌న్నీ బిగ్ హిట్. ఈ సినిమా స‌క్సెస్ లో ఎస్పీబీ గొంతు కూడా తోడైంది. ఇది ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మ‌రో మూవీ బేటా . ఇందులో అనిల్ క‌పూర్, మాధురి దీక్షిత్ న‌టించారు. ఇది ప్రైమ్ వీడియలో వ‌స్తోంది. భార‌తీయ సంస్కృతి, కుటుంబ బంధాల నేప‌థ్యంలో వ‌చ్చిన అరుదైన , అద్భుత‌మైన చిత్రం హమ్ ఆప్కే హై కౌన్. మ్యూజిక‌ల్ హిట్. ఎస్పీబీ, ల‌తా పాడిన పాట‌లు ఎవ‌ర్ గ్రీన్, ఇందులో స‌ల్మాన్ , మాధురి ప్రేమికులుగా న‌టించారు.

ఇక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా న‌టించిన చిత్రం అంజామ్. ఇందులో షారుక్ ఖాన్ , మాధురి న‌టించారు. మ‌రో బిగ్ మూవీ దిల్ తో పాగ‌ల్ హై. ఇది మ్యూజిక‌ల్ హిట్. షారుక్ , మాధురి, య‌ష్ చోప్రా కాంబోలో వ‌చ్చిన చిత్రం సూప‌ర్ హిట్. ఇది ఆపిల్ టీవీలో వ‌స్తోంది. ఇక త‌న కెరీర్ లో మ‌రిచి పోలేని మూవీ దేవ‌దాస్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన చిత్రానికి పరిచయం అవసరం లేదు. ఇది బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఇక ఓటీటీలో వ‌చ్చిందే ది ఫేమ్ గేమ్. ఇది నెట్ ఫ్లిక్స్ లో వ‌స్తోంది. మ‌రో మూవీ మ‌జా మా ప్రైమ్ వీడియోలో వ‌స్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com