బాలీవుడ్ స్టార్స్ దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, తాప్సీ పన్ను, ఆలియా భట్ , తదితరులంతా ఆస్తులను పోగేసుకుంటున్నారు. వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్, వ్యాపార, వాణిజ్య రంగాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరికొందరు బహిరంగంగానే తమ ఆస్తులను ప్రకటిస్తున్నారు. అత్యధిక ఆస్తులను కలిగి ఉన్న వారిలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రణ బీర్ కపూర్, సైఫ్ అలీఖాన్, సునీల్ షెట్టి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు.
తాజాగా వీరి జాబితాలోకి చేరింది ముద్దుగుమ్మ మాధురీ దీక్షిత్. తనకు రోజు రోజుకు ఏజ్ పెరుగుతున్నా ఎక్కడా వన్నె తగ్గడం లేదు. మరింత అందంగా తయారవుతోంది. తనను తాను నటిగా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూనే ఇతర వ్యాపారాలపై ఫోకస్ పెట్టింది. తాజాగా తన నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే ప్రముఖ హొటల్స్ నిర్వహణ భాగస్వామ్య సంస్థ ఓయోలో పెద్ద ఎత్తున షేర్స్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఓయో సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఒకటా రెండా ఏకంగా 2 మిలియన్ల షేర్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో అందరూ విస్తు పోయారు. మొత్తంగా 1990 దశకంలో ఒక ఊపు ఊపింది మాధురీ దీక్షిత్. తను సినిమాల పరంగా రూ . 250 కోట్లకు పైగా సంపాదించింది. వాటిని లాభదాయక సంస్థలలో పెట్టుబడిగా పెట్టడం, ఇతర మార్గాలకు మళ్లించడం చేసింది. మొత్తంగా మాధురీ దీక్షిత్ తెలివైన నటి అని నిరూపించుకుంది.
