చెన్నై – ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (రెడ్డి)కి కోలుకోలేని షాక్ తగిలింది. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తనకు లైకా ప్రొడక్షన్స్ కు మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తూ వచ్చింది. చివరకు కోర్టుకు చేరింది. వాయిదా పడుతూ వచ్చిన ఈ కేసు ఇవాల్టితో తేలి పోయింది. చివరకు నటుడు విశాల్ కు దిమ్మ తిరిగేలా తీర్పు వెలువరించింది.
లైకా ప్రొడక్షన్స్ సంస్థకు 30 శాతం వడ్డీ చొప్పున రూ. 21 కోట్లు చెల్లించాలని సంచలన తీర్పు చెప్పింది ధర్మాసనం. 2016లో ‘మరుదు’ సినిమా కోసం తీసుకున్న రూ.15 కోట్ల అప్పు విషయాన్ని కోర్టు ముందుకు తీసుకు వచ్చింది లైకా ప్రొడక్షన్స్. అయితే విశాల్..’వీరమె వాగై చూడమ్’ సినిమా హక్కులు ఇతర సంస్థకు అమ్మేయడంతో కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదం కొనసాగుతూ వచ్చింది.
కేసును విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక బాధ్యత కలిగిన హీరోగా ఉన్న మీరు ఇలాంటి ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే ఎలా అని ప్రశ్నించింది. ఇది ఎవరికీ మంచిది కాదని పేర్కొంది. ఓ వైపు అగ్రిమెంట్ చేసుకుని భారీ ధరకు ఇంకొకరికి అమ్ముకోవడం న్యాయం కాదని స్పష్టం చేసింది ధర్మాసనం. దీంతో తీవ్ర చిక్కుల్లో పడ్డాడు నటుడు విశాల్.
తనకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదు. చేతులు వణుకుతున్నాయి. ఇదే సమయంలో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంత లోపే మద్రాస్ హైకోర్టు నటుడికి కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టింది. మొత్తంగా ఈ ఏడాది విశాల్ కు బాగా లేదని అంటున్నారు తెలిసిన వారంతా.
