Mahatma Jyothirao Phule : భారత దేశ చరిత్రలో విస్మరించని ఒకే ఒక్కడు మహాత్మా జ్యోతిబా పూలే. అసమానతలు ఉండ కూడదని, ప్రతి ఒక్కరికీ చదువు అవసరమని ఆనాడే పోరాటం చేసిన మహోన్నత మానవుడు. ఆయన జీవిత కథను తెరకెక్కించాడు అనంత్ మహదేవన్. కథ కూడా తానే రాశాడు. సునీల్ జైన్ దీనిని నిర్మించాడు. ఓ సామాజిక వర్గాన్ని కించ పరిచేలా చేశారంటూ అభ్యంతరం తెలపడంతో ఏప్రిల్ 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతీక్ గాంధీ, పత్రలేఖ, రాజ్ ఖవారే, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, ప్రణయ్ చోక్షి నటించారు. కీలక పాత్రలు పోషించారు.
Mahatma Jyothirao Phule Biopic
సునీతా రాడియా సినిమాటోగ్రఫీ చేయగా రోహన్ రోహన్ సంగీతం అందించారు. 129 నిమిషాల నిడివి కలిగిన ఈ మూవీని డాన్సింగ్ శివ ఫిల్మ్స్ , కింగ్స్ మెన్ ప్రొడక్షన్స్ , జీ స్టూడియోస్ పంపిణీ చేసింది.
పూలే(Mahatma Jyothirao Phule) జీవిత చరిత్రను చాలా మటుకు చెప్పే ప్రయత్నం చేశాడు అనంత్ మహదేవన్. బయోపిక్ ఆన్ జ్యోతిబా పూలేను ఏప్రిల్ 2022లో ప్రకటించారు. ఈ చిత్రం భారత దేశంలో సామాజిక సంస్కరణ, విద్య కోసం పూలే, సావిత్రి బాయి చేసిన కృషిని చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతో కష్టపడి చిత్రీకరణ చేపట్టారు. సాహిత్యం కౌసర్ మునీర్, సరోష్ ఆసిఫ్ అందించారు.
సాథి పాటను మోనాలి ఠాకూర్ , ధున్ లగ్ ఆసిఫ్ రోమీ, సాథి పురుష వెర్షన్ ను రోహన్ ప్రధాన్ ఆలాపించారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ వెరిఫికేషన్ చిత్ర నిర్మాతలకు కీలక సూచనలు చేసింది. కుల వ్యవస్థ, నిర్దిష్ట కుల సంబంధిత పదాలను తొలగించాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. జ్యోతిబా, సాయిత్రి బాయి పాత్రల్లో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ అద్భుతంగా నటించారు. ఈ సంచలనాత్మక యుగంలో పూలే ను చూసేలా చేసినందుకు దర్శకుడు అనంత్ మహదేవన్ ను అభినందించాలి. దేశంలో తొలి సామాజిక సంస్కరణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే గురించి తెలుసు కోవాలంటే పూలే సినిమా తప్పకుండా చూడాలి.
Als o Read : Hero Vijay Sethupathi-Puri :పూరీ సేతుపతి మూవీలో విలన్ కన్ ఫర్మ్
