Hero Mahesh Babu-Khaleja :మే 30న మ‌హేష్ బాబు ఖ‌లేజా రీ రిలీజ్

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ

Khaleja : మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఖ‌లేజా(Khaleja). దీనిని పూర్తిగా కామెడీ , సస్పెన్స్ గా తెర‌కెక్కించాడు. గ‌తంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా ఆశించిన మేర ఆడ‌లేదు. అయితే బుల్లి తెర‌పై మాత్రం దుమ్ము రేపింది ఈ మూవీ. ఎవ‌రూ ఊహంచ‌ని రీతిలో టీఆర్పీ రేటింగ్ రావ‌వ‌డంతో విస్తు పోయారు. ఇక మ‌హేష్ బాబుకు(Mahesh Babu) ఉన్న క్రేజ్ ఏపాటిదో తెలిసే ఉంటుంది. త‌న‌కు జోడిగా అనుష్క శ‌ర్మ‌, సునీల్ న‌టించారు. ఖ‌లేజాను పూర్తిగా ఎంట‌ర్ టైన‌ర్ జాన‌ర్ లో తీశాడు. అయినా ఎందుక‌నో ఆద‌రించ లేదు. ఇక ఓటీటీలో సైతం మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డం విశేషం.

Mahesh Babu – Khaleja Re-Release

తాజాగా టాలీవుడ్ కు చెందిన టాప్ హీరో హీరోయిన్లు న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన మూవీస్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప్ర‌భాస్, చిరంజీవి, బాల‌కృష్ణ‌కు చెందిన మూవీస్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ కోవ‌లోకి వ‌చ్చాడు ప్రిన్స్ మ‌హేష్ బాబు. త‌ను న‌టించిన టాప్ సినిమాలు కూడా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇందులో అత‌డు, ఒక్క‌డు, బిజినెస్ మెన్ రానున్నాయి. తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. త‌ను న‌టించిన ఖ‌లేజా చిత్రం మే 30వ తేదీన రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

అయితే ఇదే తేదీలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన జ‌య కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌, ఎంఎం ర‌త్నం నిర్మించిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీని మొద‌ట రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ ఆ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. మే 30న రిలీ్ చేయ‌బోవ‌డం లేద‌ని జూన్ 12న క‌చ్చితంగా తీసుకు వ‌స్తామంటూ ప్ర‌క‌టించాడు నిర్మాత‌. దీంతో ఖ‌లేజా రీ రిలీజ్ కు ఎలాంటి బ్రేక్ ఉండ‌ద‌న్న‌మాట‌. మొత్తంగా మ‌రోసారి మ‌హేష్ బాబు, అనుష్క న‌వ్వించేందుకు రెడీ అవుతున్నార‌న్న‌మాట‌.

Also Read : Hero Ram Charan -Game Changer :ఓటీటీలోనూ ఆద‌ర‌ణ‌కు నోచుకోని గేమ్ ఛేంజ‌ర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com