Athadu : ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. బాల నటుడిగా రంగ ప్రవేశం చేసి సూపర్ స్టార్ గా ఎదిగాడు. అద్భుతమైన నటనతో, కామెడీ టైమింగ్ తో తనను తాను మల్చుకుని ముందుకు సాగుతున్నాడు. తను ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో జత కట్టాడు. యావత్ ప్రపంచం విస్తు పోయేలా దీనిని తెరకెక్కించే పనిలో పడ్డాడు డైరెక్టర్. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీలతో వరల్డ్ ను తన వైపు చూసేలా చేసుకున్నాడు జక్కన్న. ఇదే సమయంలో హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం విస్తు పోయారు తన టేకింగ్ ను చూసి.
Mahesh Babu Athadu Movie Sensation at Hotstar
ఇదే సమయంలో ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం ఒడిశా అడవుల్లో షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ఈ మూవీలో ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సందర్బంగా మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో మరిచి పోలేని సినిమాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా చెప్పు కోవాల్సింది మాటల మాంత్రికుడిగా పేరు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అతడు(Athadu). ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచి పోయింది.
ఇదే సమయంలో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసిన పోకిరి సూపర్ హిట్. ఆ తర్వాత తనే దర్శకత్వం వహించిన బిజినెస్ మ్యాన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ దర్శకులను సైతం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా మహేష్ నటించిన అతడు ఇప్పటికీ టెలికాస్ట్ అవుతూ రికార్డ్ బ్రేక్ చేస్తోంది. ఏకంగా ఈ సినిమాను 1500 సార్లు టెలికాస్ట్ చేసినట్లు ప్రకటించింది స్టార్ మా. గతంలో మా టీవీ గా ఉండేది. దీనిని స్టార్ స్వంతం చేసుకుంది. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 మూవీకి సంబంధించి ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డులను బ్రేక్ చేస్తోంది.
Also Read : Hero Kiran Abbavaram-Dil Ruba :నిరాశ పర్చిన దిల్ రుబా
