Mahesh Babu Jawan : టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , నయనతార, దీపికా పదుకొనే, వియ్ సేతుపతి కలిసి నటించిన జవాన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపాడు.
Mahesh Babu Jawan Viral
తాను కూడా జవాన్ ను కుటుంబంతో కలిసి చూడాలని అనుకుంటున్నట్లు మనసులో మాట బయట పెట్టాడు. మహేష్ బాబు(Mahesh Babu) కు బాలీవుడ్ నటీ నటులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు కూడా బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా తిరస్కరించారు.
తన ఫోకస్ అంతా కేవలం టాలీవుడ్ మీదేనంటూ స్పష్టం చేశాడు. సల్మాన్ ఖాన్ , షారుక్ ఖాన్ తో మంచి స్నేహం ఉంది ప్రిన్స్ కు. ఇదిలా ఉండగా భారీ బడ్జెట్ తో షారూక్ ఖాన్ తో జవాన్ తీశాడు డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్.
తన భార్య గౌరీ ఖాన్ రూ. 220 కోట్లకు పైగా ఖర్చు చేసింది ఈ ఒక్క సినిమా కోసం. అయితే విడుదల కాక ముందే రూ.350 కోట్లు కొల్లగొట్టింది. ముందస్తు టికెట్లు 5 లక్షలకు పైగా అమ్ముడు పోయాయి. ఒక్క ఇండియా లో రూ. 39 కోట్లు రాగా ఓవర్సీస్ లో రూ.18 కోట్లు కొల్లగొట్టింది.
Also Read : Anushka Shetty : మళ్లీ డార్లింగ్ తో సినిమా చేస్తా