టాలీవుడ్ లో అత్యంత జనాదరణ పొందిన నటుడు ప్రిన్స్ మహేష్ బాబు. తను ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఎస్ఎస్ఎంబీ29 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కొన్ని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించాడు. తనకు 2 ఏళ్ల పాటు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి లోగా ఎలాంటి ప్రాజెక్టు చేయకూడదని ముందే మహేష్ బాబుతో సంతకం చేయించుకున్నాడు జక్కన్న.
ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ రేంజ్ లో తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు సినిమా థీమ్ కానీ , ఇతర వివరాలు కానీ బయటకు చెప్పలేదు దర్శకుడు. ఇది మొదటి నుంచి వస్తున్నదే. కాగా ఇంకా సినిమా పూర్తి కానేలేదు. సినిమాకు సంబంధించి భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడింది. వరల్డ్ మార్కెట్ లో రూ. 2000 కోట్లకు పైగా రావచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటి దాకా ఇండియన్ హిస్టరీలో 1900 కోట్లు వస్తే గ్రేట్. కానీ దానిని తలదన్నేలా మహేష్ బాబు, జక్కన్న మూవీ రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో సినిమా పూర్తయ్యాక ఎవరితో సినిమా తీయాలనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ముందుగా వంగా సందీప్ రెడ్డి లేదంటే నాగ్ అశ్విన్ కాదంటే బుచ్చిబాబు సన దర్శకత్వంలో నటించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వంగా స్పిరిట్ ప్లాన్ లో ఉంటే నాగ్ అశ్విన్ కల్కి 2 సీక్వెల్ పై ఫోకస్ పెట్టాడు. ఇక సన రామ్ చరణ్ తో పెద్ది తీసే పనిలో పడ్డాడు. ఎవరితో వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.
